Wednesday, July 27, 2011

---------------


సాగర ఘోషను తలపించేలా..
ఊహల సవ్వడి వింటున్నా ఏకాంతంలో .
వేల వీణలు ఏక దాటిగా
గానం చేస్తున్నట్లు.. హృదయం వేదికగా నాలో

నింగిని వెలిగే.. వెన్నెల సౌధం..
నేలను తాకే.. వేకువ కిరణం..
నాకని తలిచే .. నాటి అమాయకత్వం..
కాలం లెక్కలు తెలియని మొన్నటి బాల్యం..
కనుల ముందే కలలా కదులుతూ
నా నేటిని చూసి నవ్వుతోంది ఈ వేళలో

రేయి పగలు .. పరుగులు తీస్తూ
రేపటి వైపు.. తోసుకు వెళుతూ
ఆశల వలలో చిక్కుకున్న నిమిషాలెన్నో
ఆ పరుగులు కోరే తీరం ..ఎక్కడ అని నన్ను ప్రశ్నించే ఆలోచనలెన్నో..


-------------

Thursday, July 14, 2011

ఎన్నో స్మృతులను వడిలో దాచిన నిన్న సెలవంటుంటే
ఏవో ఆశలు చూపిస్తూ.. రేపటి వైపు పోమ్మంటుంటే..
ఏ గమ్యం వైపుగా నీ పయనమని మది ప్రశ్నిస్తున్నా
సమాదానం తెలియని మది తనలో తానె తర్కిస్తున్నా
అడుగు ముందుకు వేయమ0టోంది ఆరాటం.. ఆహ్వానం అందిస్తోంది ఆశల తీరం