Tuesday, March 30, 2010

ప్రేమ

------------------




అడిగితే వచ్చేనా.. ఆమని సొగసులు
బదులుగా అడిగేనా.. కోయిల పలుకులు

అడగక వరమై .. ఆమని స్వరమై
మనసును మీటే రాగం ప్రేమ

కలల జాలము కరిగి పోయే రేయికి.. రవి మేలుకొలుపే ప్రేమ
పగటి బాటలో పరుగు తీసే మనసుకి .. శ శి.. జోల పాటే ప్రేమ

మరిగే ఇలపై .. వేసవి పిలుపై
కురిసే తొలకరి జల్లే ప్రేమ

తీరం వడి లో చేరే ఓ నిమిషం కోసం ..సాగర దూరం సాగే అల ఆరాటం కాదా ప్రేమ
చేరువ అయ్యే ఈ బంధం క్షణ కాలం అని తెలిసీ.. జేవిత కాలం వేచే తీరం ఆశే ప్రేమ

3 comments:

viswanadh said...

good one..

"తీరం వడి లో చేరే ఓ నిమిషం కోసం ..సాగర దూరం సాగే అల ఆరాటం కాదా ప్రేమ
చేరువ అయ్యే ఈ బంధం క్షణ కాలం అని తెలిసీ.. జేవిత కాలం వేచే తీరం ఆశే ప్రేమ" Nice lines......

Unknown said...

baga kaaliga unatu unnav kadara office lo em pani lekundaa

Words from my waterman said...

nice work darling....

Post a Comment

Note: Only a member of this blog may post a comment.