Monday, September 21, 2009

తొలి ప్రేమ ..

మేఘమై తేలుతున్నా నీలాకాశం లో
జల పాతమై జారుతున్నా ప్రేమావేశం లో
తొలి ప్రేమలో ఉన్నానేమో ఈ నిమిషం లో
చెలి మోమునె చూస్తున్నా ప్రతి ఒక్కరిలో

తన తలపు లో ఉందేదో తెలియని పులకింత
తెలియనిది కాదేమో ఎవ్వరికీ ఈ వింత
కొత్త గా కనిపిస్తుంది జగమంతా
ఈ మాయనే అంటారేమో ప్రేమనీ..అంతా..

తన ఊహ తో ఊగుతున్నా ఊపిరి ఊయల
నా గుండెలో కడుతున్నా వలపుల కోవెల
తన చూపులో చూస్తున్నా పున్నమి వెన్నెల
తన నవ్వులో ఉందేమో వసంత కోకిల

Tuesday, September 15, 2009

గెలుపు

This is not to preach anybody. I believe everyone knows all this stuff.
I just want put them in a small 'tavika'.


కడలిలో కలిసే వరకు
ఆగదు నది ఏ రోజూ..
వెను చూపకు అంటోంది
వెతికే గమ్యం చేరే వరకు,
అలుపెరుగని నది పరుగు ..

మండే ఎండ లో మరగాల్సిందే, మళ్లీ నింగికి ఎగసే వరకు
చల్లని మేఘం చేరాలంటే, నేలను రాలిన ప్రతి చినుకు.

రాముడైనా.. వారధి మొత్తం నడవాల్సిందే,
లంక పైనా.. రావణున్ని గెలవాలంటే
అలసి పోక.. నువు వేచి చూస్తే
వెలుగు రాధా.. చీకటి వెను వెంటే

ఓటమయినా తల వంచి పోదా
గెలుపుకై నీ పరుగాపకుంటే

Friday, September 11, 2009

ఆ రాత్రి

Don't worry...This is not a story for the next horror from the creative director chinna.

ఏదైనా తెలుగు తవిక తో బ్లాగ్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తుండగా ఓ రాత్రి గుర్తు కొచ్చింది

Night of 24th July 2003. I said cease to the nearly 1 week long activity of packing and preparation and went to bed. Next day I am starting to BITS, Pilani, A dream world for me for two years in Inter. It is a night I can never forget. A night with out sleep, A night waiting for sunrise.

ఆ రాత్రి ....

కన్నుల ద్వారం మూసే వున్నా
కలల విహారం చేస్తూ ఉన్నా

వేకువ తీరం చేరాలంటూ,
రాతిరి కడలిని దాటుకు వెళుతూ,
ఊహల నావ లో సాగే నా పయనం, చూస్తుంది నా హృదయ నయనం..

ఇంతలో

కోరిన వేకువ చేరువ కాగ,
తీరం చేరగ ఊహల నావ..

చీకటి ముసుగును మాయం చేస్తూ,
ప్రకృతి కాంత కు ప్రాణం పోస్తూ,
పచ్చని పైరుల చీరను కట్టిన, నేలను తాకెను ఉదయ కిరణం.

చీకటి గోడలు దాటుకు వచ్చి
నేలను చేరిన తపనుని కాంతి
చూపిస్తుంది మిల మిల మెరిసే సువర్ణ లోకం.
వినిపిస్తుంది కిల కిల పక్షుల అమృత గానం.