Tuesday, October 20, 2009

ప్రియతమా

కాలమే, జాలమై మాయ చేస్తున్నా
గాలమై, నా గతం నను లాగుతున్నా
ఆశతో, నీ కోసమే నే వేచి వున్నా
ఔనని, చెప్పవా ఇకనైనా ప్రియతమా...

నా ఎదే కోవెల కాగ ఈ వేళ.. కోకిలా
మౌనమే బాషగా పుజిస్తున్నా నిన్నిలా
దైవమై నువ్వే రావాలని.. ఓ ప్రియా
ఏ నాటికైనా నిజమయ్యేనా నా కల

Saturday, October 3, 2009

అమ్మ

ఏ తపము కు వరముగ.. కరిగిన దైవం ఆమె
ఏ వ్రతము కు ప్రతిగా.. దొరికిన ఫలమామె
ఈ ప్రకృతి ప్రాణ దాత కాగ అమ్మ
అవనికి ఆమణి పాట కదా ఆడ జన్మ

వెలుగే రాని నిశి లోన..
వెన్నెల గానం అమ్మ
గెలుపు ఓటమి ఒక లాగే
చెంతను చేరే చెలిమే తన ప్రేమ

అమృతాన లేని కమ్మ దనం
అమ్మతనం లోని ప్రేమ గుణం
మగువ మనసు కే సొంతం

పసి నవ్వుల పసిడి తనం
జగతి కి ఆడదిచ్చిన వరం
ఆ మాతృ మూర్తి కి మనమందరం
చేద్దాం మనసారా పాదాభివందనం