Sunday, April 17, 2011

పంటలన్నీ ఇంట చేరి కంట నింపే.. కొత్త కాంతిని..
గజ్జె కట్టి.. ఆట లాడే..గంగిరెద్దులు...సన్నాయికి
రంగవల్లుల లోగిళ్ళు..నేలకు దింపెను నింగి రంగులని..
హరి దాసుల సందడి.. అచ్చ తెలుగు సంస్కృతి..
మల్లె మనసుల, పల్లె ముంగిట నిలిపెను సంక్రాంతి

Wishing U all happy pongal ....
--------
------------------
దశాబ్దాల పోరాటానికి ..పరమార్ధం విడి పోవటమా
సమాజాన్ని పీడించే సమస్యలకది సమాధానమా.
కలిసుండమని చెప్పిన నాటి నేతలది.. అవివేకమా
సంధి నియమాలను కిందకు నెట్టిన నేతల స్వార్థమా

ఎటు సాగేనో మన ప్రజా స్వామ్యపు పయనం..
ఖండ ఖండాలుగా మిగిలేనా అఖండ భారతం
నాయకత్వపు ముసుగులో మృగాలేలుతున్న రాజ్యం

-------------------
జాతి మొత్తం.. ఒక్కటయ్యి.. జరుపుకోగా .. హోలీ పండగ
కులం..ప్రాంతం.ద్వేషాలన్నీ. మాయమవవా.. రంగుల వెనక..
మనిషి తనం.. మనలో మొగ్గ తొడిగే వేళ.. మదిలో చిన్న ఆశ
భరత ఖండం.. మరిచి పోగా.. మహమ్మారి మతం మాయ..

...Wish You all a colorful Holi...
కోకిలా.. కనబడవేం .. ఈ ఉగాది పూటా.
చైత్రమా .. నువ్వైనా.. విన్నావా తన పాటా..
అతిధిగా రావమ్మా అవని ఇంటికి 'శ్రీ ఖరమా'
సిరుల పంటలు..మాకు కానుకగా ఇవ్వమా..
-- Ramesh Samineedi
...
అందరికీ 'శ్రీఖర' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
------------------------


ఎవరిది తప్పు ,ఎవరికి ముప్పు, వాటా వ్యాపారం లో..
రాజా 'స్కాము'కి, తాజా స్కీముల సమదానమిదిగో ..

లక్షల కోట్ల..బక్షణ హక్కు.. నేతల ఖాతాలో..
ఫ్రీ గా రైస్ .. మిక్సీ, గ్రైండరు.. మన వాటాలో ..

ఎవ్వరి డబ్బు.. ఎవరికి చేరెనో .. ఈ జూదంలో
తెలిసే నాటికి.. రేపటి జాతికి.... ఏం మిగిలేనో..


-----------------------
ఊరంతా పండగే.. మీ పెళ్ళికి..
నేలమ్మ తల్లిరా..ఈ వధువుకి..
వరుడై కూర్చున్నది ఆ శ్రీహరి
వేదికగా మారింది మిథిలా పురి

అణువణువు అందాల ఈ సొగసరికి
శివధనువు విరిచిన.. నీ మగసిరికి
ముడి పెడుతూ జరిగేటి వైభోగామిది
దేవతలే బంధువులు ఈ వేడుకకి

------- --- -- శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...