Wednesday, July 27, 2011

---------------


సాగర ఘోషను తలపించేలా..
ఊహల సవ్వడి వింటున్నా ఏకాంతంలో .
వేల వీణలు ఏక దాటిగా
గానం చేస్తున్నట్లు.. హృదయం వేదికగా నాలో

నింగిని వెలిగే.. వెన్నెల సౌధం..
నేలను తాకే.. వేకువ కిరణం..
నాకని తలిచే .. నాటి అమాయకత్వం..
కాలం లెక్కలు తెలియని మొన్నటి బాల్యం..
కనుల ముందే కలలా కదులుతూ
నా నేటిని చూసి నవ్వుతోంది ఈ వేళలో

రేయి పగలు .. పరుగులు తీస్తూ
రేపటి వైపు.. తోసుకు వెళుతూ
ఆశల వలలో చిక్కుకున్న నిమిషాలెన్నో
ఆ పరుగులు కోరే తీరం ..ఎక్కడ అని నన్ను ప్రశ్నించే ఆలోచనలెన్నో..


-------------

0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.